ఫస్ట్ సాంగ్ రిలీజ్ రెడీ అవుతోన్న బాలకృష్ణ 'Akhanda - 2'

Leave a Comment


నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న తాజా సినిమా అఖండ 2 (AKhanda 2). మూడున్నరేళ్ల క్రితం రిలీజ్ అయిన అఖండకు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా నటిస్తుండగా ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషిస్తున్నారు. 


14 రీల్స్ సంస్థ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అఖండ 2 సినిమాకి రాక్ స్టార్ ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మొదటినుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా యొక్క గ్లింప్స్ టీజర్ ఇటీవల రిలీజ్ అయి మూవీ పై అంచనాలు మరింతగా పెంచింది. 


ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ ని దీపావళి నుంచి ప్రారంభించనున్నారట. ముందుగా దీపావళికి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి ఇక అక్కడ నుంచి ఒక్కొక్కటిగా సాంగ్స్, ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు టీజర్, థియేట్రికల్ ట్రైలర్ అన్ని కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోందట టీమ్. 


తప్పకుండా ఈ సినిమా బాలకృష్ణ, బోయపాటి ల కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. డిసెంబర్ 5న అఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Similar Links

0 comments:

Post a Comment