Venkatesh - Trivikram మూవీకి వర్క్ చేయనున్న టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్

Leave a Comment

 

విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమా ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. 


ఇక ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో కలిసి శంకర్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. అయితే మరోవైపు వెంకటేష్ సోలో హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం అందిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. 


కాగా ఆయన స్థానంలో యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ని టీమ్ సెలెక్ట్ చేసింది. ఆనిమల్ సినిమాకి ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఎంతో మంచి పేరు లభించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని తెలుస్తోంది. 


వెంకటేష్ మార్క్ అంశాలతో పాటు త్రివిక్రమ్ మార్క్ టేకింగ్, డైలాగ్స్, స్టైల్ తో ఈ సినిమా ఓవరాల్ గా అన్ని వర్గాలు ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నారు. 


ఇక ఈ సినిమాని త్వరలోనే పట్టాలెక్కించి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై సూర్యదేవర రాధాకృష్ణ దీనిని గ్రాండ్ గా నిర్మించనున్నారు. 

Similar Links

0 comments:

Post a Comment