ఇటీవల హృతిక్ రోషన్ తో కలిసి నటించిన War 2 మూవీ ద్వారా ఆడియన్సు ముందుకి వచ్చారు యంగ్ టైగర్ (JrNTR). ఈమూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. ఓవరాల్ గా రిలీజ్ అనంతరం ఈ మూవీ పర్వాలేదనిపించే విజయం అందుకుంది.
అయితే దాని అనంతరం ప్రస్తుతం Prashanth Neel తో Dragon మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్ వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. అయితే విషయం ఏమిటంటే నేడు హైదరాబాద్ లో ఒక యాడ్ షూట్ లో భాగంగా ఎన్టీఆర్ గాయపడ్డారు.
ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రేక్షకాభిమానులు అందరూ ఆయనకు ఏమైందని ఆందోళనకు గురయ్యారు. దానితో ఎన్టీఆర్ టీమ్ దాని పై ప్రకటన రిలీజ్ చేసింది. తగిలింది చిన్న గాయం మాత్రమే అని, ప్రస్తుతం డాక్టర్ల నుండి చికిత్స తీసుకున్న ఎన్టీఆర్ రెండు వారల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని తెలిపారు.
దానితో అందరికీ ఆయనకి జరిగిన ప్రమాదం పై క్లారిటీ వచ్చింది. కాగా తమ అభిమాన ఎన్టీఆర్ త్వరలో కోలుకోవాలని కోరుతూ పలువురు ఫ్యాన్స్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.
0 comments:
Post a Comment