Mirai లేటెస్ట్ కలెక్షన్స్ డీటెయిల్స్

Leave a Comment


యువ నటుడు తేజ సజ్జ (Teja Sajja) హీరోగా రితిక నాయక్ (Rithika Nayak) హీరోయిన్ గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మిరాయ్ (Mirai). 


ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ గా నిర్మించగా గౌర హరి సంగీతం సమకూర్చారు. అయితే ఇటీవల మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన మిరాయ్ మూవీ ఫస్ డే నుండే హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. 


హీరో తేజ ఆకట్టుకునే యాక్టింగ్ తో పాటు గ్రాండియర్  విజువల్స్, అలరించే యాక్షన్ సీన్స్ ఇందులో ప్రధానంగా అందరినీ అలరిస్తున్నాయి. శ్రియ శరన్ కీలక పాత్ర చేసిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటించారు. 


విషయం ఏమిటంటే, నిన్నటితో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ని దాటేసింది. మరోవైపు యుఎస్ఏ లో 2 మిలియన్ డాలర్స్ ని దాటేసి కొనసాగుతోంది. మరి ఓవరాల్ గా మిరాయ్ ఎంతమేర రాబడుతుందో తెలియాలి అంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. 

Similar Links

0 comments:

Post a Comment