పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజిత్ (Sujeeth) తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మాస్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి. ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు.
ఇక ఓజి నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, గ్లింప్స్ టీజర్స్ అందర్నీ ఆకట్టుకుని మూవీ పై అందరిలో భారీ అంచనాలని ఏర్పరిచాయి. సెప్టెంబర్ 21న ఓజి ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. నిజానికి ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.
హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) భారీ డిజాస్టర్ తో వారు ఢీలా పడ్డారు. కాగా పవన్ వీరాభిమాని అయిన సుజిత్ ఈ సినిమా యొక్క ప్రతి ఒక్క అంశం విషయమై ఎంతో కేర్ తీసుకుని ఓజి ని తెరకెక్కించినట్టు ఇండస్ట్రీ ట్రాక్.
తప్పకుండా ప్రేక్షకాభిమానులతో పాటు పవన్ ఫ్యాన్స్ అందరినీ ఓజీ అలరిస్తుందని, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అలానే ఎలివేషన్స్, ఆయన పలికే డైలాగ్స్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్. సుజిత్ ఈ సినిమాతో తన అభిమాన నటుడు పవన్ కి పెద్ద బ్లాక్ బస్టర్ అందించడం ఖాయమట. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఏ రేంజ్ లో విజయం అందుకుంటుందో చూడాలి
0 comments:
Post a Comment