Anushka Shetty : బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కొనసాగుతున్న 'ఘాటీ'

Leave a Comment


స్టార్ నటి అనుష్క శెట్టి (Anushka Shetty), విక్రమ్ ప్రభు (Vikram Prabhu) ప్రధాన పాత్రల్లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఎదుగురు రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి గ్రాండ్ గా నిర్మించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఘాటీ (Ghaati). ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ పర్వాలేదనిపించే రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. 


ప్రధాన పాత్ర చేసిన అనుష్క శెట్టి ఈమూవీలో శీలావతి గా పెర్ఫార్మన్స్ అదరగొట్టారని, తప్పకుండా మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని ప్రమోషన్స్ లో టీమ్ ఆశాభావం వ్యక్తం చేసింది. మొత్తంగా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఘాటీ మూవీ మొదటి రోజు నుండి ఆశించిన స్థాయి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకోలేకపోతోంది. 


వాస్తవానికి అనుష్క శెట్టి పెర్ఫార్మన్స్ కి అందరి నుండి మంచి ప్రసంశలు కురుస్తున్నప్పటికీ మూవీ యొక్క కథ, కథనాలు ఆడియన్స్ లో ఆసక్తిని ఏర్పరచలేదు. దర్శకుడు క్రిష్ పేవలమైన దర్శకత్వం వహించారని కొందరు అంటుంటే, కథ కథనాల్లో పెద్దగా కొత్తదనం లేదని, ఇది ఒక సాధారణ రివెంజ్ డ్రామా మూవీగా ప్రేక్షకాభిమానులు అభిప్రాయపడుతున్నారు. 


ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన ఈ మూవీ సెకండ్ హాఫ్ చాలావరకు బోరింగ్ గా పాత మూస పద్దతిలోనే సినిమా సాగిందనేది కొందరు విశ్లేషకుల మాట. మొత్తంగా ఘాటీ బాక్సాఫీస్ వద్ద ఇదే పరిస్థితితో కొనసాగితే ఫైనల్ గా క్లోజింగ్ లో నిర్మాతలు, బయ్యర్లకు నష్టాలు మిగల్చడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Similar Links

0 comments:

Post a Comment