సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ప్రస్తుతం ఒక భారీ పాన్ వరల్డ్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ గా అత్యధిక వ్యయంతో నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. గ్లోబల్ గా ఆడియన్సు, ఫ్యాన్స్ లో ఈమూవీ పై ఎన్నో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, టాంజానియా, కెన్యా వంటి దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ యొక్క కీలక షెడ్యూల్ ని తాజాగా నైరోబిలో షూట్ చేసారు.
అక్కడి పలువురు ప్రముఖుల్ని కలిసిన అనంతరం ఈ మూవీ గ్లోబల్ గా 120 కి పైగా దేశాల్లో విడుదల కానున్నట్లు న్యూస్ బయటకు వచ్చింది. ఇక తమ అభిమాన హీరో మూవీ నుండి ఫస్ట్ లుక్ అప్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
గ్లోబల్ ఆడియన్సు ఎదురు చూస్తున్న ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ ని నవంబర్ లో గ్రాండియర్ గా అందించనున్నట్లు ఇటీవల రాజమౌళి స్వయంగా మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రీ లుక్ రిలీజ్ సమయంలో తెలిపారు. కాగా SSMB 29 మూవీ రిలీజ్ డేట్ తో పాటు ఇతర అన్ని విషయాలు కూడా అనౌన్ మెంట్ సమయంలో వెల్లడి కానున్నాయి. ఈ మూవీ 2027 ప్రథమార్ధంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్.
0 comments:
Post a Comment