Lokesh Kanagaraj: ఆ భారీ మల్టీస్టారర్ పనులకు బ్రేక్?

Leave a Comment


అంతకముందు ఇళయదళపతి విజయ్ తో తీసిన లియో మూవీతో యావరేజ్ సక్సెస్ సొంతం చేసుకున్న లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కించిన మూవీ కూలీ. 


ఈ మూవీలో శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రలు చేసారు. అయితే ఇటీవల మంచి అంచనాల నడుమ ఆడియన్సు ముందుకి వచ్చిన ఈ మూవీ కూడా యావరేజ్ విజయం మాత్రమే అందుకుంది. అయితే దీని అనంతరం కార్తీ తో ఖైదీ 2 (Kaithi 2 మూవీని లోకేష్ తీస్తారని అందరూ భావించారు 


కానీ దాని స్థానంలో సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ లతో ఒక భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసినట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ కోలీవుడ్ అప్ డేట్ ప్రకారం ఆ మూవీ ఒక కొత్త దర్శకుడు తీయనున్నారని, కొద్దిగా క్రియేటివ్ డిఫరెన్స్ ల కారణంగా ఆ ప్రాజక్ట్ లోకేష్ నుండి మారుతోందని టాక్. 


మొత్తంగా ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీ జనవరిలో ప్రారంభం కానందట. ఒక ప్రముఖ భారీ నిర్మాణ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ ప్రాజక్ట్ కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. 

Similar Links

0 comments:

Post a Comment