సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29. ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా ఎం ఎం కీరవాణి సంగీతాన్ని వి విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు.
గ్లోబల్ గా ఆడియన్సు అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీకి సంబంధించి ఇటీవల మూడు షెడ్యూల్స్ జరుగగా ప్రస్తుతం కీలక సీన్స్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఇక్కడే ప్రత్యేకంగా వేసిన కాశీ సెట్ లో మరికొన్ని ముఖ్య సన్నివేశాలు తీయనున్నారట.
ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సెకండ్ హాఫ్ లో శ్రీరాముడి గెటప్ లో కనిపించనున్నారని, ఈ సీన్ మొత్తంగా సినిమాలో 8 నిముషాలు ఉంటుందని, ఆ సీన్స్ కి థియేటర్స్ మొత్తం షేక్ అవ్వడం ఖాయం అంటున్నారు.
కాగా ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఇటువంటి న్యూస్ ఎన్నో వైరల్ అవుతున్నప్పటికీ నవంబర్ లో రానున్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ అనంతరమే వీటిలో ఎంతవరకు వాస్తవం ఉందో మనకు తెలుస్తుంది.
0 comments:
Post a Comment