Kalki 2898 AD సీక్వెల్ నుండి Deepika Padukone అవుట్ 

Leave a Comment



టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అతిపెద్ద సంచలన విజయం అందుకున్న పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా Kalki 2898 AD


ఈ మూవీలో లోకనాయకుడు కమలహాసన్ నెగటివ్ పాత్రలో నటించగా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తో పాటు Deepika Padukone కూడా మరొక ముఖ్యపాత్ర చేసింది. రిలీజ్ అనంతరం అతిపెద్ద సంచలన విజయం అందుకున్న ఈ మూవీ యొక్క సిక్వెల్ ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 


వైజయంతి మూవీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా యొక్క సీక్వెల్ పై అందరిలో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే Kalki 2898 AD సీక్వెల్ నుంచి నటి దీపికా పదుకొనే తప్పుకున్నట్లు వైజయంతి మూవీస్ సంస్థ కొద్దిసేపటికి అధికారికంగా ప్రకటించింది. డేట్స్  అందించలేని కారణం రీత్యా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తోంది. 


ఆమె స్థానంలో మరొక స్టార్ నటిని తీసుకునేందుకు తాము త్వరలో వేట ప్రారంభించనున్నట్లు టీం తెలిపింది. మొత్తంగా అంతపెద్ద ప్రాజెక్ట్ నుంచి దీపిక తప్పుకోవటానికి కారణం, ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా చేస్తుండటమే అని టాలీవుడ్ వర్గాల టాక్. అలానే మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయని వాటి డేట్స్ అడ్జస్ట్మెంట్ కారణంగానే ఆమె కల్కి నుండి తప్పుకున్నట్టు చెప్తున్నారు.

Similar Links

0 comments:

Post a Comment