ప్రభాస్ 'Fauji' లో బాలీవుడ్ స్టార్ నటుడి కీలక పాత్ర ?

Leave a Comment

 

ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రస్తుతం ది రాజాసాబ్ (The Rajasaab) తోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్  సంగీతం అందిస్తున్నారు. 


ఈ మూవీ ఫౌజీ (Fauji) అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యువ నటి ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రెండవ ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగె లవ్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ గా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. 


మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్సు ని కూడా ఈ మూవీ ఆకట్టుకుంటుందని టీమ్ చెప్తోంది. 


బాలీవుడ్ సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, టాలీవుడ్ సీనియర్ నటి జయప్రద కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం ఈ మూవీలోని ఒక ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్ ని తీసుకోనున్నారట. ఆయన తన పాత్ర నచ్చి చేయడానికి ఒప్పుకున్నట్లు టాక్. త్వరలో ఈ మూవీ గురించి ఒక్కొక్కటిగా అప్ డేట్ రానుంది. 

Similar Links

0 comments:

Post a Comment