పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్న తాజా మాస్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి. అందాల నటి ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ మూవీలో ఓజాన్ గంబీర అనే పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా ఆయనను ఢీకొట్టే నెగిటివ్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు.
ఇక ఇతర కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యుసింగ్, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్లు, సాంగ్స్ తో అందరిలో భారీ స్థాయిలో హైప్ ఏర్పరిచిన ఓజి మూవీ మరొక వారం రోజుల్లో రిలీజ్ కానుంది.
ఇక ఈ మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుండగా దాని యొక్క రిలీజ్ డీటెయిల్స్ ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. కాగా OG ట్రైలర్ సెప్టెంబర్ 21న ఉదయం 10 గం. 8 ని. లకు విడుదల కానుంది.
ఇప్పటికే సాంగ్స్ తో అదరగొట్టిన సంగీత దర్శకుడు ఎస్ థమన్ మూవీకి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా అందించినట్లు టాక్. మొత్తంగా భారీ అంచనాలతో సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఓజి మూవీ ఏస్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
0 comments:
Post a Comment