పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ఆయనకు వీరాభిమాని అయిన సుజిత్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజి (OG). ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుంది.
డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై ఎంతో గ్రాండ్ గా భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న OG మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందిస్తున్నారు.
ఇప్పటికే ఓజి నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అమాంతంగా అంచనాలు పెంచేసాయి. విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఈ మూవీ యొక్క యుఎస్ఏ ప్రీమియర్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి.
తాజాగా ఈ మూవీ నార్త్ అమెరికా బుకింగ్స్ 1.6 మిలియన్ ని దాటి కొనసాగుతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ సినిమాల్లో టాప్ అని చెప్పాలి. ఇదే ట్రెండ్ కొనసాగి మూవీ మంచి సక్సెస్ టాక్ అందుకుంటే ప్రీమియర్స్ నుండి ఓజి అన్ని చోట్ల బిగ్గెస్ట్ రికార్డ్స్ పెట్టడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.
0 comments:
Post a Comment