OG : హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న అడ్వాన్స్ టికెట్స్ 

Leave a Comment

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రస్తుతం సుజీత్ తెరకెక్కించిన భారీ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ మూవీ OG. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటించింది. 


ఈ మూవీకి రాక్ స్టార్ ఎస్ థమన్ సంగీతం అందించగా రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందించారు. అయితే ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ నుండి అందరిలో భారీ హైప్ ఏర్పరిచిన ఈ మూవీ రేపు గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది. 


అయితే ఇప్పటికే అటు నార్త్ అమెరికాలో 2 మిలియన్ ప్రీమియర్స్ ని దాటేసిన ఈ మూవీ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఎక్కడికక్కడ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ ట్రెండ్ ని చూస్తే డే 1 భారీ నంబర్స్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది. 


ముఖ్యంగా పవన్ ఫ్యాన్ అయిన సుజీత్ ఈమూవీని అద్భుతంగా తెరకెక్కించినట్లు ఇటీవల ట్రైలర్ ని బట్టి చూస్తే కొంత అర్ధం అవుతోంది. పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఓజి మూవీ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరి ఇప్పటికే సాంగ్స్, గ్లింప్స్ టీజర్స్, ట్రైలర్ తో అందరిలో ఆకాశమంతటి అంచనాలు ఏర్పరిచిన ఓజి రిలీజ్ అనంతరం ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి. 

Similar Links

0 comments:

Post a Comment