యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) అంతకుముందు విజయ్ (Vijay) తో లియో (Leo) తాజాగా రజనీకాంత్ (Rajinikanth) తో కూలీ (Coolie) సినిమాలు తీశారు. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లు దక్కించుకున్నప్పటికీ టాక్ పరంగా అంతగా అంచనాలు అందుకోలేకపోయాయి.
ఇక వీటి అనంతరం కార్తీతో ఖైదీ 2 మూవీని లోకేష్ తెరకెక్కించనున్నారని ఇటీవల కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే కొన్ని సమస్యల కారణంగా ఆ ప్రాజెక్టును ఆయన పక్కన పెట్టారని అలానే రజనీకాంత్, కమలహాసన్ లతో ఒక భారీ మల్టీస్టారర్ ని తెరకెక్కించేందుకు లోకేష్ సన్నద్ధమవుతున్నారని సమాచారం.
మరి పక్కాగా ఈ క్రేజీ ప్రాజెక్టుని లోకేష్ డైరెక్ట్ చేస్తారా లేదా అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా లోకేష్ కనకరాజ్ తదిపరి సినిమా ఎవరితో చేస్తారనేదానికి సంబంధించి అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది. దానికి సంబంధించి క్లారిటీ రావాలి అంటే మరి కొద్దిరోజుల వరకు వెయిట్ చేయాలని తెలుస్తోంది.
0 comments:
Post a Comment