పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి (OG) సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పలు భాషల ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఓజీ తప్పకుండా బ్లాక్ బస్టర్ ఖాయమని టీం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
మరోవైపు ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా ప్రీమియర్ బుకింగ్స్ ఇప్పటికే 2 మిలియన్లకు చేరుకున్నాయి.
రేపు ట్రైలర్ రిలీజ్ ఉండటంతో దాని అనంతరం బుకింగ్స్ మరింత గ్రాండ్ గా ఊపందుకునే ఛాన్స్ కనబడుతోంది. ఈ పరిస్థితి చూస్తుంటే ఓవరాల్ గా రజనీకాంత్ Coolie నార్త్ అమెరికా ప్రీమియర్ బుకింగ్స్ ని ఓజి సునాయాసంగా దాటే అవకాశం కనబడుతోంది.
ఇక కూలీ 3.1 మిలియన్ల ప్రీమియర్లు కలెక్షన్స్ అందుకోగా ఓజి ఓవరాల్ గా 2.75 నుంచి 3.3 మిలియన్లకు చేరుకునే అవకాశం ప్రస్తుత ట్రెండును బట్టి కనపడుతుంది అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరి ఈ మూవీతో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ విజయం అందుకుంటారో చూడాలి
0 comments:
Post a Comment