బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోగా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి గ్రాండ్ గా నిర్మించిన తాజా హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కిష్కింధపురి (Kishkindhapuri).
ఈ సినిమాలో ప్రేమ, శాండీ మాస్టర్, హైపర్ ఆది, తనికెళ్ళ భరణి, కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రదర్శించిన ప్రీమియర్స్ నుంచే మంచి సక్సెస్ టాక్ అందుకున్న కిష్కింధపురి రిలీజ్ రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో ప్రస్తుతం కొనసాగుతుంది.
మొత్తంగా ఈ సినిమా యొక్క బ్రేకీవెన్ రూ. 15 కోట్లు కాగా మొదటి వారాంతంలోనే ఇది రూ. 17 కోట్లు రాబట్టి ప్రస్తుతం సూపర్ హిట్ గా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా యొక్క కలెక్షన్ల పరిస్థితి చూస్తే దాదాపుగా అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు భారీగానే లాభాలు అందించే అవకాశం కనబడుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు అనుపమ పరమేశ్వరన్, శాండీ మాస్టర్ నటన, హర్రర్ అంశాలు, ట్విస్టులు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలంగా నిలిచాయి.
0 comments:
Post a Comment