The Rajasaab : అక్టోబర్ నుండి సంబరాలు స్టార్ట్

Leave a Comment



పాన్ ఇండియన్  స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ (Riddhi Kumar) హీరోయిన్స్ గా నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది రాజాసాబ్ (The Rajasaab). 


ఈ మూవీని మారుతీ తెరకెక్కిస్తుండగా కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ వాస్తవానికి డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని టెక్నీకల్ కారణాల రీత్యా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 


త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. ప్రభాస్ ఈ మూవీలో ఫ్యాన్స్ ఎప్పటినుండో ఆశిస్తున్నా ఎంతెర్తైనింగ్ పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈమూవీ రెండు పాటలు కొంత ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ అంతా పూర్తి చేసుకుంది. 


విషయం ఏంటంటే, తాజాగా నిర్మాత ఎస్ కె ఎన్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ అక్టోబర్ నుండి మూవీకి సంబందించి కంటెంట్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తామని అన్నారు. ముందుగా ఒక్కొక్కటిగా సాంగ్స్ ఆపైన టీజర్, ట్రైలర్ ఇలా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. తప్పకుండా మూవీ రిలీజ్ అనంతరం పెద్ద విజయం ఖాయం అని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar Links

0 comments:

Post a Comment