'OG' ట్రైలర్ పోస్ట్ పోన్ : డిజప్పాయింట్ అయిన Pawan Kalyan ఫ్యాన్స్

Leave a Comment


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి (OG). ఈ మూవీలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది. 


ఎస్ థమన్ సంగీతం అందించిన ఓజి మూవీ సాంగ్స్, గ్లింప్స్ టీజర్స్ ఇప్పటికే మూవీ పై భారీగా అంచనాలు ఏర్పరిచాయి. అయితే విషయం ఏమిటంటే, ఈమూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని ఈరోజు ఉదయం రిలీజ్ చేయాల్సి ఉంది. 


కాగా ట్రైలర్ ని సాయంత్రం జరుగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేయనున్నట్లు టీమ్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. దానితో ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పూర్తిగా డిజప్పాయింట్ అయ్యారు. 


ఫ్యాన్స్ ఎమోషన్స్ తో అడ్డుకోవద్దని కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఓజి మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 25న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.

Similar Links

0 comments:

Post a Comment