మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ (Mohan Lal) పలు ఇతర భాషల ఆడియన్సు అందరికీ కూడా ఎంతో సుపరిచితం. తెలుగులో కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ హీరోగా రూపొందిన గాండీవం సినిమాలో ఒక సాంగ్ లో నటించిన మోహన్ లాల్ ఇటీవల ఎన్టీఆర్ JrNtr హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ (Janatha Garage) తో పాటు మనమంతా, కన్నప్ప (Kannappa) సినిమాల్లో కూడా నటించి ఆకట్టుకున్నారు.
ఇక కెరీర్ పరంగా మొత్తంగా 360 సినిమాల్లో నటించిన మోహన్ లాల్ ప్రతి పాత్రలో కూడా తన అలరించే యాక్టింగ్ తో ప్రేక్షకాభిమానుల మనసు దోచారు మోహన్ లాల్.
ఇక తాజాగా ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన హృదయపూర్వం మూవీ మంచి విజయం అందుకుంది. అయితే విషయం ఏమిటంటే, తాజాగా మన భారత ప్రభుత్వం సినిమా రంగంలో ఆయన అందించిన విశేష సేవలకు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది.
దానితో ఒక్కసారిగా సినిమా ప్రముఖులతో పాటు అనేకమంది ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెప్టెంబర్ 23న జరిగే 71వ నేషనల్ ఫిలిం అవార్డుల వేడుకలో ఆయనకు ఈ అవార్డుని అందించనున్నారు.
0 comments:
Post a Comment