అంచనాలు పెంచేసిన OG Trailer

Leave a Comment



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించిన తాజా సినిమా ఓజి (OG). మొదట గ్లింప్స్ టీజర్ తోనే అందరిలో భారీ స్థాయి అంచనాలు ఏర్పరచిన ఈ సినిమా సాంగ్స్ తో పాటు మరొక రెండు గ్లింప్స్ టీజర్స్ ఇటీవల రిలీజ్ అయి అంచనాలు మరింతగా పెంచాయి. 


విషయం ఏమిటంటే నేడు ఓజి మూవీ థియేట్రికల్ ట్రైలర్ (OG Trailer) ని రిలీజ్ చేశారు మేకర్స్. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ట్రైలర్ ఫైనల్ గా నేడు రిలీజ్ కావడం, అనంతరం దానికి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో టీం ఆనందం వ్యక్తం చేస్తోంది. 


ముఖ్యంగా ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్ తో పాటు డైలాగ్స్, పవర్ఫుల్ యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అదిరిపోయాయి. పవన్ తో పాటు కీలక పాత్రధారులు అందరి  సన్నివేశాలు కూడా ట్రైలర్ లో కలిపి బాగా కట్ చేశారు. 


మరీ ముఖ్యంగా డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాలో పవన్ ని ఫుల్ మాస్ యాక్షన్ పాత్రలో చూపించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ మాస్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్ అనంతరం ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 

Similar Links

0 comments:

Post a Comment