Megastar Chiranjeevi ఫ్యాన్స్ చూపు ఆ మూవీ వైపు ?

Leave a Comment



మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీని అనంతరం వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబి తో మరొక సినిమా చేయనున్నారు మెగాస్టార్. 


అయితే ఈ రెండు సినిమాల తర్వాత శ్రీకాంత్ ఓదెల తో  కూడా ఒక చేయనున్నారు మెగాస్టార్. నిజానికి అనిల్ రావిపూడి, బాబీ తీయనున్న సినిమాల కంటే కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ లో శ్రీకాంత్ తీయనున్న సినిమాపై ఎక్కువగా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ఇటీవల జరిగిన అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ సినీ ప్రియులని మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. 


తన అభిమాన మెగాస్టార్ ని వింటేజ్ పవర్ఫుల్ లుక్ లో  చేసేవిధంగా శ్రీకాంత్ ఈ మూవీ స్టోరీ రాసుకున్నారట. ఈ సినిమాలో మెగాస్టార్ ఒక  పవర్ఫుల్ మాస్ వైలెంట్ పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే మెగాస్టార్ ప్రస్తుత కమిట్మెంట్స్ అనంతరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. 


మరోవైపు నానితో ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీస్తున్న సినిమా ప్యారడైజ్. మోహన్ బాబు విలన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మెగాస్టార్, శ్రీకాంత్ ఒడిదల కాంబినేషన్ మూవీ పక్కాగా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలంటే మరి కొన్నాళ్ళైతే వెయిట్ చేయాల్సి ఉంది.

Similar Links

0 comments:

Post a Comment