పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి (OG) మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. ఇక మరోవైపు మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు టాక్.
దిల్ రాజు నిర్మాతగా సక్సెస్ఫుల్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మూవీతో పాటు కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ పై మరొక మూవీ కూడా చేయనున్నారట. ఈ మూవీని లోకేష్ కనకరాజ్, హెచ్ వినోద్ లలో ఒకరు తెరకెక్కించే ఛాన్స్ ఉందట.
అయితే ఈ రెండు సినిమాలు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయని, త్వరలోనే వీటికి సంబంధించి ఆయా మూవీ టీమ్స్ నుండి అధికారికంగా ప్రకటనలు రానున్నాయని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తమ హీరో ఓజి మూవీతో సక్సెస్ కొట్టడంతో తదుపరి రానున్న సినిమాల పై పవన్ ఫ్యాన్స్ మరింత నమ్మకంగా ఉన్నారు. మరి ఈ మూవీస్ పవన్ కు ఎంతమేర విజయాలు అందిస్తాయో చూడాలి.
0 comments:
Post a Comment