ఆవేదనతోనే అలా మాట్లాడాను : నిర్మాత Rajesh Danda

Leave a Comment


యువ నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా రాజేష్ దండా నిర్మాతగా జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా KRamp. ఇటీవల దీపావళి పండుగ కానుకగా మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో బాగానే కలెక్షన్ తో కొనసాగుతోంది. 


అయితే తమ సినిమాపై ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ నెగెటివిటీ చేస్తూ సినిమా బాగా ఆడుతున్నప్పటికీ కూడా ఇంకా నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తుందని నిర్మాత రాజేష్ దండా ఒక ప్రముఖ మీడియా వెబ్సైట్ పై విరుచుకుపడ్డారు. 


అయితే దానికి సంబంధించి తాజాగా ఆయన వివరణ ఇచ్చారు. నిజానికి మీడియా మొత్తం పై తన యుద్ధం కాదని కేవలం ఒక వెబ్సైట్ మాత్రమే తమ సినిమా బాగా ఆడుతున్నప్పటికీ కూడా కావాలని తొక్కేయాలని నెగెటివిటీ చేస్తూ ఇప్పటికీ కూడా ప్రచారం చేస్తున్నారనిఅన్నారు. 


వారి తప్పుడు విధానం తనకు నచ్చలేదని తెలిపారు. ఇది నిర్మాతగా తన ఆవేదనే తప్ప ప్రత్యేకంగా ఎవర్ని అనాలనే ఉద్దేశం తనకు లేదని మీడియా మిత్రులతో తనకు ఎంతో మంచి అనుబంధం ఎన్నో ఏళ్ల మిత్రత్వం ఉందని నిర్మాతగా తన ఆవేదన అందరూ అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. 

Similar Links

0 comments:

Post a Comment