JrNtr Dragon మూవీ వాయిదా పడనుందా ?

Leave a Comment


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (JrNtr) ఇటీవల War2 మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆయన హీరోగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ సినిమా డ్రాగన్ (Dragon). అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ భారీ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. 


కేజిఎఫ్, సలార్ సినిమాల తరువాత ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ కావటం అలానే బిగ్గెస్ట్ మాస్ యాక్టర్ ఎన్టీఆర్ తో కలిసి ఆయన తొలిసారిగా ఈ సినిమా చేస్తుండటంతో ఊహకు అందని స్థాయిలో అందరిలో దీని పై పాన్ ఇండియన్ రేంజ్ లో అంచనాలున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 


అందాల నటి రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి సంబంధించి తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కోసం టీమ్ సన్నద్ధం అవుతోంది. 


విషయం ఏమిటంటే ఈ సినిమాని వాస్తవానికి వచ్చే ఏడాది జూన్ చివర్లో రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేసి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు. కానీ లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం కొన్ని కారణాల రీత్యా ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ అయ్యే అవకాశం కనబడుతోందని తెలుస్తోంది. 


తాజాగా ఒక మీడియా మీట్ లో భాగంగా ఈ సినిమా నిర్మాతలైన రవిశంకర్, నవీన్ ఎర్నేని కూడా అదే మాట చెప్పారు. వచ్చే ఏడాది డ్రాగన్ రిలీజ్ తప్పకుండా ఉంటుందని చెప్పారు కానీ, పక్కాగా రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వకపోవడంతో రిలీజ్ జూన్ 25న కాకుండా మరి కొన్నాళ్ళు వాయిదా పడ్డట్లేనని ఇండస్ట్రీ వర్గాల టాక్. 

Similar Links

0 comments:

Post a Comment