Mirai : తేజ సజ్జ తల్లిపాత్రలో అదరగొట్టిన శ్రియ శరణ్

Leave a Comment



యువ నటుడు తేజ సజ్జ (Teja Sajja) తాజాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నటించిన మూవీ మిరాయ్ (Mirai). ఈమూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల గ్రాండ్ గా నిర్మించగా హీరోయిన్ గా రితిక నాయక్ నటించింది. 


అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి వచ్చింది. వాస్తవానికి ఈమూవీకి నిన్న రాత్రి ప్రత్యేక ప్రీమియర్స్ ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అనంతరం యుఎస్ఏ ప్రీమియర్స్ కి కూడా మంచి స్పందన అందుకున్న ఈమూవీ ప్రస్తుతం థియేటర్స్ లో బాగా పాజిటివ్ టాక్ తో కొనసాగుతోంది. 


విషయం ఏమిటంటే ఈ మూవీలో తేజ సజ్జ తల్లిగా అంబికా అనే పాత్రలో నటించారు నటి శ్రియ శరణ్ (Shriya Saran). ఇందులో ఆమె పాత్ర ఎంతో చక్కగా రాసుకున్నారు దర్శకుడు కార్తీక్. కథకు మెయిన్ లీడ్ అయిన ఆమె మరొక్కసారి తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. 


తేజ సజ్జ ఆకట్టుకునే యాక్టింగ్ తో పాటు అలరించే యాక్షన్ సీన్స్, ముఖ్యంగా విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి మిరాయ్ కి మంచి సక్సెస్ ని అందించాయి. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎంతమేర కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.

Similar Links

0 comments:

Post a Comment