యూట్యూబ్ గా కెరీర్ మొదలెట్టిన యువ నటుడు మౌళి (Mouli Tanuj Prasanth) తాజాగా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా లిటిల్ హార్ట్స్ (Little Hearts). యువ నటి శివాని నగరం (Shivani Nagaram) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని 90s మూవీ ఫేమ్ ఆదిత్య హాసన్ గ్రాండ్ గా నిర్మించగా యువ దర్శకుడు సాయి మార్తాండ్ దీనిని తెరకెక్కించారు.
ప్రీమియర్స్ నుండే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయి అన్ని ఏరియాల్లో కూడా అదరగొట్టే కలెక్షన్ తో కొనసాగుతోంది. సింజిత్ యెర్రమిల్లి సంగీతం సమకూర్చిన ఈ మూవీకి సూర్య బాలాజీ ఫోటోగ్రఫి అందించారు.
ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైన్మెంట్ అంశాలతో తెరకెక్కిన లిటిల్ హాట్ సినిమాలో రాజీవ్ కనకాల, సత్య కృష్ణన్, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరో మౌళి తో పాటు తన స్నేహితుడు పాత్ర చేసిన జైకృష్ణ సీన్స్, డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
ముఖ్యంగా అన్ని వర్గాల ఆడియన్సు తో పాటు యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది లిటిల్ హార్ట్స్ సినిమా. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలో 500కే డాలర్స్ ని ఆర్జించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ దిశగా కొనసాగుతోంది, మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎంత కొల్లగొడుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
0 comments:
Post a Comment