Kantara: Chapter 1 : ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

Leave a Comment


సరిగ్గా మూడేళ్ళ క్రితం కన్నడలో రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా స్వీయదర్శకత్వంలో రూపొందిన మూవీ కాంతారా (Kantara). వాస్తవానికి అక్కడ అంతగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈమూవీ కన్నడలో మంచి విజయం అందుకోవడం, అనంతరం తెలుగుతో పాటు పలు ఇతర పాన్ ఇండియన్ భాషల్లో కూడా రిలీజ్ అయిన కాంతారా ఓవరాల్ గా రూ. 400 కోట్ల పైన కలెక్షన్ రాబట్టింది. 


ఇక ప్రస్తుతం దానికి ప్రీక్వెల్ గా రూపొందుతోన్న మూవీ కాంతారా చాప్టర్ 1 (Kantara: Chapter 1). ఈ మూవీలో రిషబ్ శెట్టి హీరోగా రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తుండగా ఇతర పాత్రల్లో రాకేష్ పూజారి, జయరాం, గుల్షన్ దేవయ్య నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని మించేలా దర్శకుడు రిషబ్ ఈ మూవీ యొక్క కథ, కథనాల విషయమై మరింతగా శ్రద్ద తీసుకుని దీనిని తెరకెక్కించినట్లు సమాచారం. 


ఈ మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో రూ. 125 కోట్ల భారీ వ్యయంతో నిర్మితం అయింది. అక్టోబర్ 2న గ్రాండ్ గా పలు పాన్ ఇండియన్ భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే భారీ ఎత్తున జరుగుతోంది. 


అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, కాంతారా చాప్టర్ 1 మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని సెప్టెంబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి టీమ్ నుండి అఫీషియల్ ప్రకటన రానుంది. త్వరలో పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభం కానున్న ఈ మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. మరి రిలీజ్ అనంతరం ఇది ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 

Similar Links

0 comments:

Post a Comment