గత ఏడాది సంక్రాంతికి హను మాన్ (Hanu-Man) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న తేజ సజ్జ (Teja Sajja) తాజాగా నటించిన సినిమా మిరాయ్ (Mirai). శ్రియ శరణ్ కీలకపాత్రలో కనిపించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించిగా రితిక నాయక్ హీరోయిన్ గా నటించింది.
యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. ఈ యాక్షన్ ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ ని సంపాదించింది.
ఇక ఈ సినిమాలో హీరో తేజ సజ్జ నటన, గ్రాండియర్ విజువల్స్, దర్శకుడు కార్తీక్ టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ అలానే ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ బాగానే రాబడుతోంది. మొత్తంగా ఈ మూవీ తాజాగా వంద కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. హను మాన్ అనంతరం తేజ సజ్జ రెండవ వంద కోట్ల మూవీ ఇది. ప్రస్తుతం ఇంకా బాక్సాఫీస్ వద్ద బాగానే కొనసాగుతున్న మిరాయ్ ఓవరాల్ గా ఎంత రాబడుతుందో చూడాలి.
0 comments:
Post a Comment