NTR Neel (Dragon) : ఆ రెండు సినిమాలను మించేలా తీస్తున్నారా ?

Leave a Comment

 

ఇటీవల హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి ఎన్టీఆర్ (Jr Ntr) చేసిన పాన్ ఇండియన్ స్పై యాక్షన్ సినిమా వార్ 2 (War 2) బాక్సాఫీస్ వద్ద ఓవరాల్ గా యావరేజ్ సక్సెస్ అయింది. ఈ సినిమానంతరం తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా డ్రాగన్ (వర్కింగ్ టైటిల్). రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోవినో థామస్ నెగిటివ్ పాత్ర చేస్తున్నట్టు టాక్. 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రవి బస్ రూర్ సంగీతం అందిస్తున్నారు. 

అయితే విషయం ఏమిటంటే ముఖ్యంగా డ్రాగన్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ గతంలో తాను తెరకెక్కించిన కేజీఎఫ్ సిరీస్ సినిమాలు అలానే సలార్ సినిమాని మించేలా మరింత గ్రాండ్ గా రూపొందిస్తున్నారట దర్శకుడు ప్రశాంత్ నీల్. 

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రతో పాటు ఆయన పలికే డైలాగ్స్, యాక్షన్ సీన్స్, విజువల్స్ ఇప్పటివరకు ఎక్కడా చూడని విధంగా మాస్ రేంజ్ లో ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారని టాక్. ఓవరాల్ గా డ్రాగన్ రిలీజ్ అనంతరం అతిపెద్ద సంచలనం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ సినిమాని 2026 జూన్ 25న గ్రాండ్ గా పలుభాషల ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు

Similar Links

0 comments:

Post a Comment