ఇటీవల పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్స్ లో రిలీజ్ అయిన డివోషనల్ యానిమేషన్ మూవీ Mahavatar Narasimha. ఈ మూవీని యువ దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించగా క్లీం ప్రొడక్షన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది.
కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ వారు సమర్పకులుగా వ్యవహరించిన ఈ మూవీ మొదట కన్నడలో మంచి క్రేజ్ అందుకుని ఆ తరువాత తెలుగు, హిందీ భాషల ఆడియన్సు ని ఆకట్టుకుంది. కేవలం రూ. 14 కోట్ల రూపాయల వ్యయంతో ఎంతో చక్కగా రూపొందిన ఈ మూవీకి ఆడియన్సు అందరూ కూడా నీరాజనాలు పట్టారు.
ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల గ్రాస్ పాగా రాబట్టిన మహావతార్ నరసింహ లో వరాహావతారం సన్నివేశాలతో పాటు మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే నరసింహావతారా సన్నివేశాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే అసలు మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ సెప్టెంబర్ 19 నుండి అనగా నేడు అర్ధరాత్రి నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం Netflix ద్వారా పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది. మరి థియేటర్స్ లో అందరినీ ఆకట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ మూవీ ఓటిటిలో ఎంతమేర రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
0 comments:
Post a Comment