రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతారా సినిమా ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి ఎంతో పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం దానికి సీక్వెల్ గా తెరకెక్కు తున్న మూవీ కాంతారా చాప్టర్ 1 (Kantara Chapter 1). ఇందులో రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలే ఫిలిమ్స్ దీన్ని మరింత గ్రాండియర్ గా నిర్మిస్తోంది. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని అక్టోబర్ 2న రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ సినిమా. తెలుగు, కన్నడ తో పాటు పలు పాన్ ఇండియన్ భాషల్లో కాంతారా చాప్టర్ 1 మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
విషయం ఏమిటంటే సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు తమ మూవీ యొక్క అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ని అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు కాంతారా టీం కొద్దిసేపటి క్రితం అనౌన్స్మెంట్ అందించింది.
అయితే రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పటికీ కూడా కేవలం ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేసి మిగతా కంటెంట్ మొత్తం గోప్యంగా ఉంచడానికి కారణం సినిమా కంటెంట్ మీద టీంకు ఉన్న నమ్మకం అంటున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా కాంతారాని మించి మరింత పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుందని కన్నడ వర్గాలు చెప్తున్నాయి.
0 comments:
Post a Comment