ఇటీవల మంచి అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన కన్నడ మూవీ కాంతారా. తాజాగా ఈ సినిమాకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న మూవీ కాంతారా చాప్టర్ 1 (Kantara Chapter 1).
ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్నారు. గ్రాండ్ గా భారీ వ్యయంతో నిర్మితమైన ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని నేడు కొద్దిసేపటి క్రితం అధికారికంగా రిలీజ్ చేశారు.
ట్రైలర్ లో యాక్షన్ సీన్స్, విజువల్స్ అలాగే హీరో హీరోయిన్ల సన్నివేశాలు పలు ఎమోషనల్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అయితే ప్రేక్షకాభిమానులు ఆశించిన స్థాయిలో ఈ ట్రైలర్ కి ప్రస్తుతం రెస్పాన్స్ రావడం లేదు.
ఓవరాల్ గా తెలుగులో యావరేజ్ రెస్పాన్స్ అందుకున్న కాంతరా చాప్టర్ 1 ట్రైలర్, మొత్తంగా సినిమాపై కొంతవరకు అయితే అంచనాలు పెంచింది.
మరి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా భారీ ఎత్తున పలు భాషల ఆడియన్స్ ముందుకు రానున్న కాంతరా చాప్టర్ 1 మూవీ ఎంత మేరకు విజయం అందుకుంటుందో చూడాలి.
0 comments:
Post a Comment