కోలీవుడ్ యువ నటుడు శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఇటీవల అమరన్ మూవీతో కెరీర్ పరంగా పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అనంతరం తాజాగా ఆయన నటించిన మూవీ మదరాశి (Madharaasi). ఈ మూవీని ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించగా కన్నడ అందాల భామ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా నటించింది.
మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 5న విడుదలైన మదరాశి మూవీ ప్రస్తుతం పర్వాలేదనిపించేవిధంగా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఈమూవీలో మానసిక సమస్య కలిగిన వ్యక్తిగా శివ కార్తికేయన్ నటనకు అందరి నుండి మంచి ప్రసంశలు లభిస్తున్నాయి.
అయితే దీనితో పాటు ఇప్పటికే మరోవైపు లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ చేస్తున్న మూవీ పరాశక్తి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2026 సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది.
అయితే అసలు విషయం ఏమిటంటే, దీని తర్వాత ఓవైపు గోట్ మూవీ ఫేమ్ వెంకట్ ప్రభుతో ఒక మూవీ చేసేందుకు సిద్దమైన శివ కార్తికేయన్, దానితో పాటు గతంలో తనతో డాన్ వంటి సూపర్ హిట్ మూవీ తీసిన సిబి చక్రవర్తితో మరొక్కసారి జతకట్టేందుకు సిద్ధమయ్యారు. డాన్ మూవీతో నటుడిగా బాక్సాఫీస్ పరంగా శివకార్తికేయన్ ఎంతో పేరు అందుకున్నారు.
అలానే ఈ మూవీ కూడా ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందనున్నట్లు టాక్. త్వరలో ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
0 comments:
Post a Comment