Peddi : ఫస్ట్ సింగిల్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్

Leave a Comment

 


తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ పాన్ ఇండియన్ డ్రామా మూవీ పెద్ది (Peddi). ఈ మూవీలో మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ దివ్యెందు తో పాటు కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


ఈ సినిమాలో జాన్వి కపూర్ (Jahnvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్న పెద్ది సినిమా మార్చి 27న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఒక అద్భుతమైన సాంగ్ అయితే టీం చిత్రీకరిస్తోంది. 


ఎక్కడా పెద్దగా బ్రేక్స్ లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ. అయితే అసలు విషయం ఏమిటంటే తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్టు రామ్ చరణ్ ఒక పోస్ట్ పెట్టారు. 


ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఆ సాంగ్ ని దసరా పండుగ రోజు రిలీజ్ చేస్తారని టాక్. ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కోరుకునే అన్నిరకాల అంశాలతో అద్భుతంగా దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న పెద్ది రిలీజ్ అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం ఖాయమని టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

Similar Links

0 comments:

Post a Comment