The Rajasaab : ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్

Leave a Comment

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా సంజయ్ దత్ కీలకపాత్రలో మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ది రాజా సాబ్ (The Rajasaab). ఈ మూవీలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ది రాజా సాబ్ మూవీ వాస్తవానికి డిసెంబర్ 5న రిలీజ్ కావలసి ఉంది. అయితే సినిమాకి సంబంధించి కొన్ని పనుల ఆలస్యం కారణంగా కొన్నాళ్లపాటు రిలీజ్ వాయిదా వేసి వచ్చేడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు టీమ్ అయితే సన్నాహాలు చేస్తుంది. 


ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్స్ అందరిలో మూవీ పై మరింతగా అంచనాలను పెంచేసాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఆయనని ఏ విధంగా అయితే చూడాలనుకుంటున్నారో అటువంటి ఎంటర్టైన్మెంట్ పాత్రతో పాటు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాలో అదిరిపోతుందని టాక్. 


ఇక మారుతి మార్క్ మేకింగ్ తో పాటు ఓవరాల్ గా రిలీజ్ అనంతరం మూవీ పెద్ద విజయం ఖాయం అని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీరుతుందట. ఇక మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ని దసరా పండుగ రోజు వెల్లడించుకున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

Similar Links

0 comments:

Post a Comment