Peddi : ఆ అంశంలో కూడా దర్శకుడు బుచ్చిబాబు స్పెషల్ కేర్ ?

Leave a Comment


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ప్రస్తుతం బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది (Peddi). యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా మూవీగా రూపొందుతున్న పెద్దిలో జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా మీర్జాపూర్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ నటుడు శివారాజ్ కుమార్ కీలక పాత్రలు చేస్తున్నారు. 


మైత్రి మూవీ మేకర్స్, వ్రిద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల పై వెంకట సతీష్ కిలారు భారీగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. 


ఇటీవల గేమ్ ఛేంజర్ తో డిజాస్టర్ చవిచూసిన తమ అభిమాన కథానాయకుడు రామ్ చరణ్, తప్పకుండా పెద్దితో పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయం అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2026 సమ్మర్ కానుకగా మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 


విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఈ మూవీ కథ కథనాలతో పాటు సాంగ్స్ అలానే మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయమై కూడా దర్శకుడు బుచ్చిబాబు ఎంతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. రేపు థియేటర్స్ లో రిలీజ్ అనంతరం కీలక సీన్స్ లో బీజీఎమ్ మరొక రేంజ్ లో ఉండనుందని టాక్. 

Similar Links

0 comments:

Post a Comment