Prabhas Birthday : ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ రెడీ ?

Leave a Comment

 

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రస్తుతం సెట్స్ మీద రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మారుతీ తీస్తున్న ది రాజాసాబ్ (The Rajasaab) కాగా మరొకటి హను రాఘవపూడి తీస్తున్న మూవీ. అయితే వీటి అనంతరం త్వరలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారు ప్రభాస్. ఆ తరువాత సలార్ 2, కల్కి 2 కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. 


అలానే వీటితో పాటు మరొక రెండు ప్రాజక్ట్స్ కూడా ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి. మొత్తంగా మరొక మూడేళ్ళ వరకు ప్రభాస్ మూవీ డైరీ ఆల్మోస్ట్ ఫుల్ అని తెలుస్తోంది. 


కాగా అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మొత్తంగా ఫ్యాన్స్ కి మూడు ట్రీట్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి ది రాజాసాబ్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండగా, రెండవది హను రాఘవపూడి మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు బాహుబలి ఎపిక్ రిలీజ్ కి సంబంధించి కూడా మరొక స్పెషల్ ట్రీట్ ఉందట. 


మొత్తంగా మరొక వారంలో ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు. అయితే వీటిలో 2026 సంక్రాంతికి ది రాజాసాబ్ మూవీ రానుండగా అదే ఏడాది ద్వితీయార్థంలో హను రాఘవపూడి మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. మరి ఈ సినిమాలు ప్రభాస్ కు ఎంతమేర విజయం అందిస్తాయనేది చూడాలి. 

Similar Links

0 comments:

Post a Comment