మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu).
ఈ సినిమాని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై సాహుగారపాటి, సుస్మిత కోణిదెల గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన మీసాల పిల్ల (Meesala Pilla) సాంగ్ అందరిని విశేషంగా కట్టుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో టాప్ లో అయితే ట్రెండ్ అవుతుంది.
మొత్తంగా ఈ సాంగ్ తో ఒక్కసారిగా అందరిలో కూడా మూవీ పై క్రేజ్ ని ఆకాశమంతటి స్థాయికి తీసుకెళ్లారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాకి భీమ్స్ సిసిలోరియో సంగీతం అందిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.
సంక్రాంతి పండుగ కానుకగా జనవరిలో విడుదల కానున్న మనసంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఖాయమని టీం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరోవైపు మెగాస్టార్ ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరి రిలీజ్ అనంతరం ఈ మూవీ ఎంతమేర విజయవంతం అవుతుందో చూడాలి.
0 comments:
Post a Comment