Akhanda 2 దీపావళి ట్రీట్ రెడీ

Leave a Comment


నటసింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తరికెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఆఖండ 2 (Akhanda 2). ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్ లో భారీగా పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తోంది. 


ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం మరోవైపు డబ్బింగ్ వర్క్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా జరుగుతోంది. 


ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ అఘోర పాత్రలో పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారని అంటోంది టీమ్. అయితే విషయం ఏమిటంటే, నేడు దీపావళి సందర్భంగా అఖండ 2 నుండి టీజర్ ని అక్టోబర్ 24న సాయంత్రం 4 గం. 54 ని. లకు రిలీజ్ చేయనున్నట్లు నేడు టీమ్ ఒక అప్ డేట్ అందించింది. 


ఇక మూవీని డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు. ఈ మూవీని పార్ట్ 1 ని మించేలా దర్శకుడు బోయపాటి శ్రీను మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట. ఇకపై ఒక్కొక్కటిగా అఖండ 2 నుండి వరుస అప్ డేట్స్ అందించనుంది టీమ్. 

Similar Links

0 comments:

Post a Comment