The Rajasaab :మారుతీకి పెద్ద పరీక్షే

Leave a Comment


టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ది రాజాసాబ్ (The Rajasaab). 


నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ కు నటిస్తున్న ఈ సినిమా జనవరి 9న గ్రాండ్ గా విడుదల కానుంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి. 


తాజాగా ది రాజాసాబ్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, అలానే థియేట్రికల్ ట్రైలర్ ఆకట్టుకుని అందరిలో సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇక ఈ సినిమా వాస్తవానికి దర్శకుడిగా మారుతీకి పెద్ద పరీక్ష అని చెప్పాలి. ఇటీవల కెరీర్ పరంగా ఆశించిన స్థాయి సక్సెస్ లో అయితే ఆయనకు లేవు. 


పక్కాగా ఈ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలని స్క్రిప్ట్ ని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా అద్భుతంగా రాసుకున్నారట దర్శకుడు మారుతి. రేపు థియేటర్స్ లో రిలీజ్ అనంతరం ది రాజాసాబ్ మూవీ అందరినీ ఆకట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాయమని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కాగా ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు

Similar Links

0 comments:

Post a Comment