పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ఇటీవల సుజిత్ దర్శకత్వంలో చేసిన సినిమా ఓజి (OG). ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాని పవన్ చేస్తున్నారు.
ఈ మూవీలో తమిళ నటుడు పార్థిపన్ నెగిటివ్ పాత్ర చేస్తుండగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తోంది.
అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఇక సినిమాని ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా దర్శకుడు హరీష్ శంకర్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారని, గబ్బర్ సింగ్ తర్వాత 12 ఏళ్ల అనంతరం తనకి ఇష్టమైన పవన్ కళ్యాణ్ తో చేస్తున్న మూవీ కావటంతో ఆయన అన్ని అంశాలపై గట్టిగా దృష్టి పెట్టినట్టు నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని తాజాగా ఒక మీడియా కార్యక్రమంలో భాగంగా చెప్పారు. ఓవరాల్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అనంతరం పెద్ద విజయం ఖాయం అనే ఆశాభావాన్ని వారిద్దరు వ్యక్తం చేశారు.
0 comments:
Post a Comment