96 మూవీతో పెద్ద విజయం అందుకున్నారు తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), అందాల నటి త్రిష (Trisha) హీరోయిన్ గా ఈ మూవీ రూపొందింది. హృద్యమైన లవ్ స్టోరీ గా తెరకెక్కి మంచి విజయం అందుకున్న ఈ మూవీని తెలుగులో శర్వానంద్, సమంత లతో జాను టైటిల్ తో రీమేక్ చేసారు.
అయితే ఈ మూవీ అనంతరం అరవింద్ స్వామి, కార్తీ లతో ఆయన తీసిన మరొక హృద్యమైన సినిమా సత్యం సుందరం. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది.
కాగా త్వరలో 96 మూవీ సీక్వెల్ ని ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తారని ఇటీవల కొన్నాళ్లుగా వార్తలు రాగా, లేటెస్ట్ కోలీవుడ్ బజ్ ప్రకారం ఆ మూవీ పూర్తిగా ఆగిపోయిందని సమాచారం.
అలానే త్వరలో మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ (Fahad Faasil) తో తాను ఒక మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రేమ్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. తన మార్క్ హృద్యమైన అంశాలతో ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందనున్న ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయని అన్నారు.
0 comments:
Post a Comment