యువ నటుడు తేజ సజ్జ (Teja Sajja) గత ఏడాది సంక్రాంతికి హనుమాన్ (Hanu Man) సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇక తాజాగా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఆయన నటిస్తున్న పాన్ ఇండియన్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా మిరాయ్ (Mirai).
ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తుండగా రితిక నాయక్ తేజకి జోడిగా నటిస్తోంది. ఇప్పటికే మిరాయ్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ మొదలుకొని సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా సినిమాపై అంతకంతకు అంచనాలని పెంచేసాయి. సెప్టెంబర్ 12న గ్రాండ్ లెవెల్ లో పలు భాషలు ఆడియన్సు ముందుకు రానుంది ఈ మూవీ.
అయితే అసలు విషయం ఏమిటంటే ఇటీవల కెరిర్ పరంగా పెద్ద విజయాలు లేని యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దీనితో ఎలాగైనా భారీ విజయం కొట్టాలని చూస్తున్నారు. మరోవైపు తేజకి కూడా ఇది ఒకరకంగా చాలెంజింగ్ ప్రాజెక్టు అనే చెప్పాలి. హనుమాన్ తర్వాత ఆయన ఎటువంటి సినిమా చేస్తారని అందరూ ఎదురుచూసారు.
ఫైనల్ గా మిరాయ్ ద్వారా మన ముందుకి వస్తున్న తేజ దీనితో పెద్ద సక్సెస్ అందుకోవటం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల టాక్. మరి అటు కార్తీక్ ఘట్టమనేని ఇటు తేజ సజ్జ ఇద్దరి కలయికలో వస్తున్న మిరాయ్ వారిద్దరికీ ఏ స్థాయి విజయాన్నందిస్తుందో చూడాలి
0 comments:
Post a Comment