Siddu Jonnalagadda తెలుసు కదా టీజర్ ఎలా ఉందంటే ?

Leave a Comment



యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) టిల్లు సిరీస్ సినిమాలతో నటుడిగా ఆడియన్సు లో తనకంటూ ప్రత్యేకంగా పేరు సొంతం చేసుకున్నాడు. ఇటీవల వచ్చిన టిల్లు స్క్వేర్ తో పెద్ద విజయం అందుకున్నప్పటికీ  ఆ తరువాత వచ్చిన జాక్ మూవీ మాత్రం ఘోరంగా ఫెయిల్ అయింది. 


ఇక ప్రస్తుతం తొలిసారిగా మెగాఫోన్ పడుతున్న లేడీ డైరెక్టర్ నీరజా కోన దర్శకత్వంలో చేస్తున్న లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ తెలుసు కదా. ఈ మూవీలో యువ అందాల నటీమణులు శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), రాశి ఖన్నా (Raashi Khnna) హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ నేడు రిలీజ్ అయింది. 


అయితే టీజర్ ని బట్టి చూస్తే ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇద్దరు అమ్మాయిలని ప్రేమించిన యువకుడు చివరికి వారిద్దరినీ ఎలా హ్యాండిల్ చేసాడు అనే కథ కథనాలతో ఈమూవీ రూపొందినట్లు అర్ధం అవుతుంది. 


టీజర్ లోసిద్దు, హీరోయిన్స్ ఇద్దరి లుక్స్, డైలాగ్స్ తో పాటు విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు బాగానే కుదిరాయి. మొత్తంగా బెటర్ రెస్పాన్స్ అందుకున్న తెలుసుకదా టీజర్ మూవీ పై పర్వాలేదనిపించే అంచనాలు ఏర్పరిచింది. ఇక ఈ మూవీని 17 అక్టోబర్ 2025న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Similar Links

0 comments:

Post a Comment