యువ అందాల నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కీలక పాత్రలో యువ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా కామెడీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా మూవీ పరదా (Parada). ఈ మూవీని ఆనంద మీడియా సంస్థ గ్రాండ్ గా నిర్మించగా గోపి సుందర్ సంగీతం అందించారు.
మలయాళ నటి దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ మయూర్, హర్ష వార్ధన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు చేసిన ఈమూవీ రిలీజ్ అనంతరం ఆశించిన స్థాయి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. వాస్తవానికి చక్కటి కథ కథనాలతో రూపొందిన ఈ మూవీలో సుబ్బలక్ష్మి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ ఎంతో సహజంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు.
పడతి అనే గ్రామ సాంప్రదాయాన్ని ఉల్లంఘించిందని సుబ్బు పై నింద పడడం, అనంతరం దానిని ఆమె ఎలా సరిచేసుకుంది అనే కథాంశంతో సాగిన ఈ మూవీలో అనుపమ పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.
అయితే విషయం ఏమిటంటే, థియేటర్స్ లో పెద్దగా పెర్ఫార్మ్ చేయని పరదా మూవీ మూడు వారాల థియేటర్స్ ప్రదర్శన అనంతరం తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మరి థియేటర్స్ లో ఆడని ఈ మూవీ ఓటిటి లో ప్రేక్షకుల్ని ఎంతమేర మెప్పిస్తుందో చూడాలి.
0 comments:
Post a Comment