పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మాస్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి (OG). ఈ మూవీలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై దానయ్య, కళ్యాణ్ దాసరి గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్నారు.
ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్, రెండు సాంగ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. మరోవైపు ఈ మూవీ యొక్క యూఎస్ఏ ఫ్రీ రిలీజ్ బుకింగ్స్ వన్ మిలియన్ దాటేసాయి.
ఇక ఈ సినిమాని సెప్టెంబర్ 25న అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు టీమ్ అయితే ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కి వీరాభిమాని అయిన సుజిత్ ఈ మూవీలో ఆయన పాత్రను అద్భుతంగా రాసుకున్నారని ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందర్నీ కూడా పవన్ ఓజాస్ గంభీర పాత్రలో అదరగొట్టే రేంజిలో కనిపిస్తారని టాక్.
మొత్తంగా పవర్ స్టార్ ఓజి రిలీజ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ మొత్తం దద్దరిల్లటం ఖాయమని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. మరి రిలీజ్ అనంతరం ఓజి ఎంతమేర బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.
0 comments:
Post a Comment