సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా SSMB29. ఈ సినిమాపై అందరిలో కూడా భారీ స్థాయిలో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీలకపాత్రలు పోషిస్తున్న SSMB 29 షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమా యొక్క టైటిల్ తో పాటు అఫీషియల్ అనౌన్స్మెంట్ నవంబర్లో అందించినట్లు ఇప్పటికే దర్శకుడు రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీకి GEN 63 అనే టైటిల్ ని ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు.
దీనికి ప్రధాన కారణం సినిమాలోని కీలక కథాంశంలో భాగంగా 63 తరాల తర్వాత వ్యక్తులని హీరో కలుసుకోవడం దాని కధానుసారమే మిగతా కథనం మొత్తం ముందుకు సాగటం జరుగుతుందని టాక్. అందుకే ఈ టైటిల్ని ఫిక్స్ చేశారని చెప్తున్నారు.
మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై టీం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాని 2027 ప్రథమార్ధంలో రిలీజ్ చేసేందుకు యూనిట్ కసరత్తులు చేస్తోంది. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా గడ్డంతో పాటు బల్క్ గా బాడీని కూడా పెంచుతున్న సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment