టాలీవుడ్ స్టార్ నటి సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఇటీవల నిర్మాతగా మారి నిర్మించిన సినిమా శుభం. అందులో ఆమె ఒక చిన్న కామియో పాత్ర కూడా చేశారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే విజయం అందుకుంది. ఇక ఇటీవల మాయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత ఆ తర్వాత కొన్నాళ్ళకు చికిత్స తీసుకుని మొత్తంగా కోలుకున్నారు.
కాగా ప్రస్తుతం సినిమాల సెలక్షన్స్ పరంగా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ మన లైఫ్ లో ఎన్నో ముఖ్యం అనుకున్నప్పటికీ కూడా ఒకసారి ఆనారోగ్య సమస్యకు ప్రవేశించాక దాని ముందు మిగతావన్నీ చిన్నవిగా కనపడతాయని అన్నారు.
అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు, ముఖ్యంగా మానసిక ప్రశాంతతను ఎప్పటికప్పుడు అలవర్చుకుంటే మిగతా ఎటువంటి సమస్యలు ఉండవని అన్నారు. అందుకే అన్నిటికంటే ఆరోగ్యమే ముఖ్యమైనదని ఆమె చెప్పుకొచ్చారు.
ఇకపై సినిమాల ఎంపిక విషయంలో కూడా తాను మరింత జాగ్రత్త వహించుకున్నట్లు సమంత చెప్పారు. కాగా సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ (Rakt Brahmand: The Bloody Kingdom) ది బ్లడీ కింగ్డమ్ మూవీ చేస్తున్నారు. రాజ్ అండ్ డికె తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ మూవీలో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రలు చేస్తున్నారు.
0 comments:
Post a Comment