Raviteja - Kishore Tirumala మూవీ టైటిల్ ఫిక్స్ ?

Leave a Comment


మాస్ మహారాజా రవితేజ (Raviteja) ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర సినిమా చేస్తున్నారు. అక్టోబర్ 31న ఈ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీనితో పాటు మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా ఆయన ఒక సినిమా చేస్తున్నారు. 


వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమాకి అనార్కలి అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. 


ఈ మూవీ తాజాగా షెడ్యూల్ స్పెయిన్ లో జరగనుండగా రెండు సాంగ్స్, ఒక కీలక ఎపిసోడ్ చిత్రీకరించనున్నాడు. తాజా లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీకి భర్త మహాశయులకు విజ్ఞప్తి, అంటే భర్తల అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆకట్టుకునే కథాకథనాలతో విభిన్న కోణంలో దర్శకుడు కిషోర్ తిరుమల దీనిని తెరకెక్కించారని అంటున్నారు. 


త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు, రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా టీం అందించనుంది. మొత్తంగా రిలీజ్ అనంతరం ఈ సినిమా దర్శకుడు కిషోర్ తిరుమలకి హీరో రవితేజకి మంచి బ్రేక్ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.  

Similar Links

0 comments:

Post a Comment